: 'దోమలు సోషలిస్టులు' అంటూ జోకేసిన కేసీఆర్


'దోమలు సోషలిస్టులు. అవి నన్ను కుడతాయి, కలెక్టరును కుడతాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయనూ కుడతాయి. అవి ఎవరినీ లెక్కచేయవు కాబట్టి, పేదల నుంచి ప్రభుత్వం దాకా అందరమూ కలసి హైదరాబాదులో దోమల నిర్మూలనను చేపట్టాల'ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిని అందరమూ కలసి ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లాలోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ఆయన, ఈ దోమ జోకు చెప్పి అందరినీ నవ్వించారు. ప్రజల దీవెనలతో హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని అన్నారు. అమెరికాలో, లండన్‌ లో ఉన్నవాళ్లు బంగారం తినడం లేదని, వారు కూడా మనలాగే అన్నమే తింటారని వ్యాఖ్యానించిన ఆయన, వాళ్లు ముందుగానే నిద్ర నుంచి మేల్కొని బాగుపడ్డారని, మనం ఆ పని ఇప్పుడు చెయ్యాలని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News