: రాజమౌళి ట్వీట్ తో ప్రాణం పోసుకున్నా: సంపూర్ణేశ్ బాబు
తాను చిత్ర సీమలో ప్రవేశించాక ఎన్నో కష్టాలు పడ్డానని సెన్సేషనల్ యాక్టర్ సంపూర్ణేశ్ బాబు తెలిపారు. ఓ తెలుగు వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. నేరుగా ఫోన్ చేసి తనను చాలా మంది తిడుతుంటారని తెలిపారు. అయినా, తనకు ఎవరిపైనా కోపంలేదని అన్నారు. 'మా ఊరి హీరో' అంటూ తన ఊరిలో గొప్పగా చెప్పుకున్నారని చెప్పారు. హీరోగా చేస్తున్నానంటే ఎవరూ నమ్మలేదని అన్నారు. "నేనంటే నాకు చాలా ఇష్టం... నేను చాలా అందంగా ఉంటా" అని చెప్పుకొచ్చారు. 'హృదయకాలేయం'తో హీరోగా మారానని, ఆ సినిమా ట్రైలర్ కు రాజమౌళి ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేనని, అది సినిమా విజయానికి దోహదపడిందని చెప్పారు. స్టీఫెన్ శంకర్ ఓ పిండిబొమ్మను చేస్తే రాజమౌళి ట్వీట్ తో దానికి ప్రాణం పోశారని తెలిపారు. టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో నూరు శాతం సపోర్ట్ లభిస్తుందని అన్నారు.