: కోహ్లీ కండిషన్లతో అనుష్క మనస్తాపం!


టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు అర్థమవుతోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించింది లేదు. స్మోకింగ్ తగ్గించాలని, సినిమాల్లో అసభ్య సన్నివేశాల్లో నటించరాదని... ఇలా, కోహ్లీ పలు కండిషన్లు విధిస్తుండడంతో అమ్మడు మనస్తాపం చెందినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. తమ ప్రేమాయణాన్ని బహిర్గతం చేసిన తర్వాత, సరైన నడవడిక కనబర్చకపోతే మీడియా దృష్టిలో పడతామని కోహ్లీ గట్టిగానే చెప్పాడట. అందుకు అనుష్క, తన కెరీర్ అలాంటిదని బదులిచ్చిందట. ఈ కారణంగానే, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని టాక్.

  • Loading...

More Telugu News