: నాణేలు చెల్లించి కారు కొన్నాడు... లెక్కించేందుకు ఆపసోపాలు పడిన షోరూం సిబ్బంది


చైనాలో ఓ వ్యక్తి కారు కొనేందుకు వెళ్లాడు. మామూలుగా విలువైన వస్తువులు కొనేందుకు ఏం చేస్తాం? ఏ డెబిట్ కార్డో, క్రెడిట్ కార్డో తీసుకెళతాం. కాదనుకుంటే క్యాష్ కట్టలు పట్టుకెళతాం. ఈ చైనా వ్యక్తి మాత్రం నాలుగు టన్నుల నాణేలు తీసుకెళ్లి కార్ల షోరూం సిబ్బందికి అగ్నిపరీక్ష పెట్టాడు. కారు విలువ 1.40 లక్షల డాలర్లట. అందుకు సమానమైన నాణేల్ని ఓ ట్రక్కులో వేసుకుని వెళ్లాడు. పాపం! ఆ నాణేలు లెక్కించడానికి పది మంది సిబ్బంది ఆపసోపాలు పడ్డారట. లోయనింగ్ ప్రావిన్స్ లోని షెన్యాంగ్ పట్టణానికి చెందిన ఈ వ్యక్తి ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేసేవాడు. అక్కడ వినియోగదారులు ఇచ్చిన నాణేలను దాచుకుని, వాటితోనే కారు కొనడం విశేషం.

  • Loading...

More Telugu News