: బాబు సర్కారుకు గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. అమరావతి నిర్మించతలపెట్టిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలు నిర్మిస్తే కృష్ణా రివర్ బెడ్ కు పెను ముప్పు వాటిల్లుతుందని అందిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. కాగా, ఇదే విషయంలో సుప్రీంకోర్టులో సైతం కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News