: ఆటగాడి చెంపపై కొట్టి వీడియో ట్విట్టర్లో పెట్టిన సైనా... డబ్ స్మాష్ మానియా!
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా డబ్ స్మాష్ మానియాలో పడిపోయింది. డబ్ స్మాష్ టెక్నిక్ తో రూపొందించిన మూడు వీడియోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఆ వీడియోల్లో సైనా, సహచర షట్లర్ అక్షయ్ దేవాల్కర్ తో కనిపిస్తుంది. ఓ వీడియోలో ఆమె దేవాల్కర్ చెంప చెళ్లుమనిపించడం చూడొచ్చు. అందాజ్ అప్నా అప్నా, హేరా ఫేరీ చిత్రాల్లోని పాప్యులర్ డైలాగులకు అనుగుణంగా సైనా, దేవాల్కర్ పెదాలు కదిపారు. డబ్ స్మాష్ అంటే... వీడియోలో ఒరిజినల్ డైలాగులు వినవస్తుండగా, వాటికి అనుగుణంగా వ్యక్తులు పెదాలు కదపడమే. తద్వారా, ఆ డైలాగుల్లోని పంచ్ వారినోటే పలికిన ఎఫెక్ట్ సాధ్యమవుతుంది.