: వరల్డ్ నెంబర్ వన్ ను మట్టికరిపించిన తెలుగుతేజం
తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు చెన్ లాంగ్ ను మట్టికరిపించి సెమీస్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో కశ్యప్ 14-21, 21-17, 21-14 తో చైనా అగ్రశ్రేణి షట్లర్ లాంగ్ ను చిత్తు చేశాడు. 63 నిమిషాల పాటు సాగిన ఈ సమరంలో తొలి గేమ్ చేజారినా కశ్యప్ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. వరుసగా రెండు గేముల్లో చెలరేగిపోయాడు. చెన్ లాంగ్ ను అధికశాతం బేస్ లైన్ కే పరిమితం చేసి పాయింట్లు గెలుచుకున్నాడు. కాగా, లాంగ్ పై కశ్యప్ కిది రెండో విజయం.