: రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా... కస్టడీ పిటిషన్ పై సాయంత్రం తీర్పు
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 9కి విచారణను హైదరాబాదులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. అయితే 8న కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. మరోవైపు రేవంత్ ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.