: కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తిన టీడీపీ ఎంపీ
తెలంగాణ టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదని, ఆయన పనితీరుతో తెలంగాణలోని పేదలకు మేలు జరుగుతుందని ప్రశంసించారు. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగాక మంచి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారని, మల్కాజ్ గిరి ప్రాంతానికి వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు సీఎం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.