: రైతులకు కేంద్రం బంపరాఫర్!
రైతులకు భరోసానిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రుతుపవనాలు ఆలస్యమై వర్షపాతం తగ్గితే రైతులకు పెట్టుబడి రాయితీలు అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు విద్యుత్, డీజిల్, విత్తనాల పంపిణీలో సైతం రాయితీలు ఇస్తామని తెలిపింది. పాత రుణాల పునర్వ్యవస్థీకరణతో పాటు, కొత్త రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామని వివరించింది. కాగా, ఈ సంవత్సరం వర్షాలు సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.