: రేవంత్ పై స్టింగ్ ఆపరేషన్ చేశారు... ఇవి చెల్లవని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది: కోర్టులో రేవంత్ తరపు న్యాయవాది
రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్, ఏసీబీ కస్టడీ పిటిషన్ పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది నాగేశ్వర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. అధికార టీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నారని... అందుకే టీఆర్ఎస్ ఆయనను టార్గెట్ చేసిందని కోర్టుకు విన్నవించారు. పక్కా ప్లాన్ తో ఇరికించారని తెలిపారు. దీనికోసం, టీఆర్ఎస్ ప్రభుత్వం సీక్రెట్ కెమెరాలను అమర్చి, స్టింగ్ ఆపరేషన్ చేయించిందని... అయితే, స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.