: నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు ప్రత్యేక కోర్టు అనుమతి
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. బొగ్గు కుంభకోణంలో నిందితుడుగా ఉన్న ఆయన... విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని విచారించిన ప్రత్యేక కోర్టు జూన్ 14 నుంచి 29 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, నవీన్ జిందాల్ తదితరులతో పాటు పలు సంస్థలు కూడా ఉన్నాయి.