: ఆ రేపిస్టులు ఒట్టి అమాయకులట... గోవా మంత్రి వివాదాస్పద వ్యాఖ్య


మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లు ఒట్టి అమాయకులట. అంతేకాదండోయ్, సామూహిక అత్యాచారాలు ఎక్కడ జరగడం లేదు చెప్పండి? అంటున్నారు ఘనత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్. గతంలో మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ ఓ యువకుడి పట్ల అనుకూల వ్యాఖ్యలు చేసిన పరులేకర్, రెండు రోజుల క్రితం గోవాలో వెలుగుచూసిన సామూహిక అత్యాచార ఘటనపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడం లేదు చెప్పండి? ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన యువకులున్నారే, వారు ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చిన్న ఘటనలు. ఇలాంటి ఘటనల వల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గోవా లాంటి పర్యాటక ప్రాంతంలో మద్యం, మాదకద్రవ్యాలు వినియోగించడం మామూలేనని, అవి లేకుంటే అసలు టూర్ నే ఆస్వాదించలేమని కూడా ఆయన సెలవిచ్చారు.

  • Loading...

More Telugu News