: అసలు అమ్మ ఎవరు?... పది నెలల బాలుడి ముఖంలో ఎన్ని భావాలో!
ఒకేలా ఉండే కవలల్ని చూస్తే చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎవరు ఎవరో పోల్చుకోవడం అత్యంత దగ్గరి బంధు మిత్రులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అదే ఒక పది నెలల చిన్నారి అయితే ఏం చేస్తాడు? తన తల్లి కవల సోదరిని తొలిసారిగా కలిసిన సమయంలో ఆ బుడతడి హావభావాలు, ముఖంలో కనిపించిన ఆందోళన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోను యూట్యూబ్ లో 38 లక్షల మంది చూసేశారు. 10 నెలల బాలుడు ఫిలిక్స్ ను బంధువులకు చూపించేందుకు కెనడా నుంచి లితూనియాకు తీసుకెళ్లింది వాళ్లమ్మ. ఆక్కడ వాళ్లమ్మకు కవల సోదరిగా ఉన్న మరో అమ్మను చూసినప్పుడు ఫిలిక్స్ హావభావాలను వాడి తండ్రి డానియస్ చిత్రీకరించాడు. వాడి చిన్న బ్రెయిన్ ఎవరు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కళ్లు పెద్దవి చేసి అటూ ఇటూ చూస్తూ, వాడిచ్చిన రియాక్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.