: మైలేజీలో స్విఫ్ట్ డిజైర్ ను అధిగమించిన 'సెలేరియో' కారు!


మారుతి సుజుకి నుంచి ఇటీవల భారత మార్కెట్లోకి విడుదలైన కారు సెలేరియో. డీజిల్ వర్షన్ గా విడుదలైన ఈ కారు ధర రూ. 4.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనట. ఈ కారు లీటరు డీజిల్ తో 27.62 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫికెట్ లభించింది. ఇంతకుముందు ఇండియాలో అధిక మైలేజి ఇచ్చే కారుగా స్విఫ్ట్ డిజైర్ (26.59 కి.మీ/లీ.) కొనసాగిన సంగతి తెలిసిందే. కాగా, మారుతి సెలేరియో డీజిల్ కారు 793 సీసీ, 2-సిలిండర్ ఇంజనుతో లభిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కారు కోసం మారుతి సుజుకి రూ. 900 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News