: 'మ్యాగీ' విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి ప్రధాని కార్యాలయం సమన్లు


కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి ప్రధాని కార్యాలయం సమన్లు జారీ చేసింది. మ్యాగీ న్యూడిల్స్ వివాదంలో నివేదిక అందించాలని సమన్లలో ప్రధాని కార్యాలయం కోరింది. మరోవైపు, మ్యాగీ నూడిల్స్ లో హానికారక రసాయనాలు ఉన్నాయన్న విషయం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం మ్యాగీపై 15 రోజుల నిషేధం విధించగా... తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు మ్యాగీపై నిషేధం విధించి, వాటిపై పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి. మరోవైపు గత అర్ధరాత్రి నుంచి నెస్లే కంపెనీ మ్యాగీ అమ్మకాలను దేశవ్యాప్తంగా నిలిపివేసింది. వీలైనంత త్వరలో ప్రజల నమ్మకాన్ని చూరగొని, మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News