: డ్రగ్స్, లేదా డబ్బు... ఏదిచ్చినా కడుపులోని బిడ్డనిస్తానంటూ ప్రకటన


"ఆరు నెలల గర్భవతిని. నాకీ గర్భం వద్దు. డబ్బులు లేదా డ్రగ్స్ కు అమ్మకానికి పెట్టాలనుకుంటున్నా. నా బిడ్డ గ్యారంటీగా తెల్లగా ఉంటాడు. నన్ను చీప్ గా భావించవద్దు. సీరియస్ ఆఫర్లుంటే చెప్పండి" అని ఓ మహిళ తన ఫేస్ బుక్ పేజీలో ప్రకటన పెట్టడం సంచలనం సృష్టించింది. యూఎస్ లోని జార్జియా రాష్ట్రం, అట్లాంటాలోని క్రెయిగ్ లిస్ట్ అనే మహిళ ఈ పని చేసింది. ఇలా పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టిన ఈవిడపై నెట్ ప్రియులు మండిపడ్డారు. వందల మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ ప్రకటనలో నిజానిజాలు వెలికితీసేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News