: కుంభమేళాలో నేడు 'మౌని అమావాస్య'


అలహాబాదులో జరుగుతున్న మహా కుంభమేళాకు ఈ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు 'మౌని అమావాస్య' కావడంతో భక్తులు త్రివేణి సంగమానికి తరలి వస్తున్నారు. సుమారు మూడు కోట్ల మంది భక్తులు ఈ రోజు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. మౌని అమావాస్య రోజున పవిత్ర గంగానదిలో స్నాన మాచరించడాన్ని హిందువులు పుణ్యప్రదంగా భావిస్తారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని స్నాన ఘట్టాలలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులను, బాంబు నిర్వీర్యక నిపుణులను కుంభమేళాలో మోహరించారు.

  • Loading...

More Telugu News