: నాజూకు అందం సీక్రెట్ చెప్పిన చార్మి
హైదరాబాదులో జరుగుతున్న 'జ్యోతిలక్ష్మీ' ఆడియో లాంచ్ వేడుకలో హీరోయిన్ చార్మి, యాంకర్ శ్యామల మధ్య ఆసక్తికర సంబాషణ నడిచింది. అసలు, నడుం అంతలా ఎలా సన్నబడిందో చెప్పాలని శ్యామల అడిగింది. చార్మి నడుం విషయం దర్శకుడు పూరీ జగన్నాథే చెప్పాలని పట్టుబట్టింది. దాంతో, చార్మి అందుకుని ఆయన తన నడుం విషయంలో కాంప్లిమెంట్లు ఎన్నో ఇచ్చి అలసిపోయారని, దాని గురించి ఇంకేం చెప్పలేరని పేర్కొంది. అయితే, నువ్వే చెప్పాలని శ్యామల కోరగా, చార్మి సిగ్గులమొగ్గయింది. నడుం సన్నబడేందుకు అనుసరించిన సీక్రెట్ ఏంటో చెబితే అమ్మాయిలు ఫాలో అవుతారు కదా? అని శ్యామల అనడంతో, చార్మీ కాస్త సిగ్గు పడుతూనే 500 యాబ్స్ చేసేదాన్నని, అందుకు నడుం అంత సన్నబడిందని వివరించింది. ఆ కష్టం సినిమాలో కనిపించిందని శ్యామల ప్రశంసించింది.