: పులివెందులలో సమాధానం చెప్పేందుకైనా సిద్ధం: పరిటాల సునీత
ఏపీ మంత్రి పరిటాల సునీత వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సమరదీక్ష పేరుతో జగన్ డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉనికి కోసమే ఈ దీక్ష అని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదన్నారు. ఆయన విడుదల చేసిన ప్రజా బ్యాలెట్ పై పులివెందులలో సమాధానం చెప్పేందుకైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తో వైసీపీ కుమ్మక్కైందని, దీనిపై ప్రజలకు ఏం జవాబిస్తారని సునీత నిలదీశారు. ఇక, రేవంత్ రెడ్డి అరెస్టుపైనా సునీత స్పందించారు. ఈ వ్యవహారం వెనుక కేసీఆర్ కుట్ర ఉందన్నారు.