: హైదరాబాద్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేస్తారు. నగరంలోని మల్కాజ్ గిరి పరిధిలో 3,300, ఖైరతాబాద్ పరిధిలోని ఎన్ బీటీ కాలనీలో 7 వేల కుటుంబాలకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల క్రమబద్ధీకరణలో భాగంగా పేదలకు ఈ పట్టాలు ఇస్తున్నారు. అయితే కొన్ని నెలల్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యానే కనీసం లక్ష మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.