: త్వరలో ఓ ఇంటివాడవుతున్న రోహిత్ శర్మ


టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు. చిరకాల నేస్తం రితికా సజ్దేతో రోహిత్ శర్మ నిశ్చితార్థం ముంబయిలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు, మిత్రులు హాజరయ్యారు. బొరివాలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక ఫక్తు ప్రైవేటు కార్యక్రమంలా సాగినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో రోహిత్, రితికా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఐపీఎల్ తాజా సీజన్ లో రితికా... రోహిత్ శర్మ ఆడిన మ్యాచ్ లకు హాజరై సందడి చేసింది. ఆరేళ్లుగా వీరిమధ్య ప్రేమాయణం నడుస్తోంది.

  • Loading...

More Telugu News