: మొబైల్ టారిఫ్ లను పెంచిన ఐడియా... అదే దారిలో ఇతర టెల్కోలు!


స్పక్ట్రమ్ తరంగాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించిన టెలికం సంస్థలు ఆ సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు కస్టమర్లపై భారం మోపడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా డేటా టారిఫ్ లను 18 శాతం మేరకు పెంచుతున్నట్టు ఐడియా ప్రకటించింది. ఈ పెంపు న్యూఢిల్లీ, ఎన్ సీఆర్ రీజియన్లలో తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు 2జి, 3జి సేవల కోసం అందిస్తున్న రీచార్జ్ లలో మార్పులు చేసింది. సమీప భవిష్యత్తులో మరో ఐదారు సర్కిళ్లలో సైతం డేటా టారిఫ్ లను ఐడియా సెల్యులార్ పెంచవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఐడియా కస్టమర్ కేర్ నుంచి పొందిన వివరాల ప్రకారం 3జి టారిఫ్ 18 శాతం, 2జి టారిఫ్ 11 శాతం మేరకు పెరిగింది. ఉదాహరణకు 28 రోజుల వ్యాలిడిటీ ఉండే 1జిబి 3జి ప్యాక్ నిన్నటివరకూ రూ. 249గా ఉండగా, ఇప్పుడది రూ. 295 రూపాయలకు పెరిగింది. ఇదే 2జి ప్యాక్ ధర రూ. 175 నుంచి రూ. 195కు పెరిగింది. దీంతో పాటు పలు ఇతర ప్యాక్ ల వ్యాలిడిటీ పరిధులను సంస్థ తగ్గించింది. గడచిన మార్చిలో జరిగిన స్పెక్ట్రమ్ వేలం తరువాత డేటా టారిఫ్ లను పెంచిన తొలి సంస్థ ఐడియానే. కాగా, ఐడియా దారిలోనే మిగతా టెలికం సంస్థలు నడవనున్నాయని, అన్ని కంపెనీలూ టారిఫ్ లను పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News