: మంగళగిరిలో సమరదీక్ష విరమించిన జగన్
గుంటూరు జిల్లా మంగళగిరిలో తలపెట్టిన సమరదీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విరమించారు. ఏపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తొలి రోజు వైసీపీ ప్రజాబ్యాలెట్ పేరుతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. ఐదు ప్రధాన అంశాలపై దీక్ష చేసినట్టు దీక్ష విరమణ అనంతరం జగన్ తెలిపారు. అంతకుముందు విశాఖలో భారీ ధర్నా నిర్వహించామన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పినవన్నీ చంద్రబాబు మర్చిపోయారని ఆరోపించారు. కాగా, నేడు 'రాష్ట్రానికి మోసగాడు' అంటూ బాబుపై వైసీపీ ఓ పుస్తకం విడుదల చేసింది.