: హిందుత్వవాదులకు షాకిచ్చిన శంకరాచార్య


శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వ్యాఖ్యలతో కలకలం రేపారు. నిన్న, కేదార్ నాథ్ ఆలయ పూజారులు హిందువులు కాదు, వాళ్లని తొలగించాలని డిమాండ్ చేసిన ఆయన... తాజాగా, హిందుత్వవాదులకు దిగ్భ్రాంతి కలిగించే అభిప్రాయం వెలిబుచ్చారు. 'కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం పెద్ద తప్పు' అని పేర్కొన్నారు. ఆనాడు కరసేవకులు తప్పిదానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కారు రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం చేయడానికి బదులు, ఆలయ నిర్మాణం వ్యవహారాన్ని రామ జన్మభూమి న్యాస్ ట్రస్టుకు అప్పగించాలని సూచించారు. మరి, శంకరాచార్య తాజా వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్ పీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News