: సహజీవనంపై ధైర్యంగా అభిప్రాయాలు వెల్లడించిన నిత్యా


దక్షిణాది సినిమాల్లో తన ప్రతిభను ప్రదర్శించి, అభిమానులకు బాగా దగ్గరైన యువ నటి నిత్యా మీనన్ సహజీవనంపై తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడించింది. పెళ్లికి ముందు సహజీవనం పెద్ద విషయమేమీకాదని చెప్పింది. ముక్కూమొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కరెక్టు కాదని, పెళ్లికి ముందే భాగస్వామి గురించి ఓ నిర్ణయానికి రావడం మేలని తెలిపింది. జీవితానికి సంబంధించిన విషయాల్లో యువత స్వేచ్ఛను కోరుకుంటోందని ఈ కేరళ భామ వివరించింది. ప్రస్తుత కాలంలో డేటింగ్ ను తప్పుగా భావించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఇటీవలే దిగ్గజ దర్శకుడు మణిరత్నం సినిమా 'ఓకే బంగారం'లో నిత్యా మీనన్ ప్రేమికుడితో సహజీవనం చేసే యువతి పాత్ర పోషించింది. ఆ పాత్ర తన అభిప్రాయాలకు అనుగుణంగా ఉండడంతో మరేమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News