: అల్లుడి చరిత్ర తెలియాలంటే అత్తనే అడగాలి!: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి సెటైర్లు విసిరారు. అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే అత్తనే అడగాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. బాల్యంలో చంద్రబాబు ఘనకార్యాలను తల్లిగానీ, టీచర్లుగానీ అడ్డుకుని ఉంటే, ఇప్పుడు రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదన్నారు. ఒకటో తరగతిలో ఉండగానే పక్కన కూర్చున్న పిల్లవాడి దగ్గర బలపం కొట్టేసిన ఘనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇక, ఎన్టీఆర్ వద్ద రూ.10 లక్షలు తీసుకుని ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని అన్నారు. కేజీ బేసిన్ లో సహజవాయు నిక్షేపాలు బయటపడినప్పుడు చంద్రబాబు చక్రం తిప్పాడని ఆరోపించారు. రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని వివరించారు. 'ఏమైనా, అల్లుడి చరిత్ర అత్తకే కదా తెలిసేది!" అంటూ చమత్కరించారామె.