: స్టేడియానికి రిక్షాలో వెళుతుండగా... రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బంగ్లాదేశ్ కెప్టెన్


బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ మష్రఫే మొర్తజా మిర్పూర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రాక్టీసు కోసం తన నివాసం నుంచి స్టేడియానికి రిక్షాలో వెళుతుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మొర్తజాకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, జూన్ 18 నుంచి టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్టు బంగ్లాదేశ్ టీమ్ మేనేజ్ మెంట్ పేర్కొంది. కాగా, మొర్తజా రెండు చేతులకు బ్యాండేజ్ లు వేశారు. షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగే ట్రైనింగ్ సెషన్ కు వెళ్లేందుకు ఈ ఆల్ రౌండర్ సైకిల్ రిక్షాను ఆశ్రయించాడు. బస్సు, రిక్షా స్వల్పంగా ఢీకొనడంతో ఎవరికీ ప్రమాదకర గాయాలు కాలేదు. బంగ్లాదేశ్ జట్టు కోచ్ చండిక హతురసింఘ దీన్నో దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. అతని అరచేయి గాయంపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. వన్డే సిరీస్ నాటికి కోలుకునేందుకు అతనికి వీలైనంత విశ్రాంతి కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News