: కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ నిమిత్తం రేవంత్ తదితర నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఏసీబీ కోరనుంది. దానికి సంబంధించి మాట్లాడేందుకే కేసీఆర్ ను కలసినట్టు సమాచారం. అంతేగాక రేపు రేవంత్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైన కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.