: అదే రోజు డెలివరీ... వద్దనుకుంటే గంటన్నరలో వాపస్ కూడా: స్నాప్ డీల్ సరికొత్త ఆఫర్
ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ మరో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులు తమకు నచ్చకుంటే ఆ విషయాన్ని తెలియజేసిన 90 నిమిషాల్లో తమ ప్రతినిధి వచ్చి దాన్ని వెనక్కు తీసుకువెళ్తారని తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఎంపిక చేసిన 15 నగరాలకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ చిత్రవంశీ వెల్లడించారు. ఇప్పటికే స్నాప్ డీల్ పలు నగరాలు, పట్టణాల్లో ఆర్డర్ చేసిన ఒక్కరోజులో డెలివరీని అందిస్తున్న సంగతి తెలిసిందే. కస్టమర్లకు మరింత పారదర్శకతతో కూడిన సమర్థవంతమైన సేవలను అందించే లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆశిష్ వెల్లడించారు.