: టీఆర్ఎస్ కు మద్దతుపై జగన్ సమాధానం చెప్పాలి: మంత్రి యనమల
పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో సీఎం చంద్రబాబును ఇరికించాలని చూస్తున్న టీఆర్ఎస్, వైసీపీలపై మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చంద్రబాబుపై అక్కసుతోనే టీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న జగన్ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాగా స్టింగ్ ఆపరేషన్ చట్ట సమ్మతం కాదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు.