: 2+2=3... టెన్త్, ఇంటర్ పేపర్లు దిద్దిన గుజరాత్ టీచర్ల విద్యా నైపుణ్యం!
రెండును రెండుతో కలిపితే ఎంత? ఒకటో తరగతి పిల్లాడిని అడగాల్సిన ప్రశ్న ఇది. సమాధానమూ వస్తుంది. కానీ, గుజరాత్ లో ఉపాధ్యాయులకు, అందునా టెన్త్, ఇంటర్ ప్రశ్నాపత్రాలను దిద్ది మార్కులేసే వారికి తెలిసింది మాత్రం '2+2=3' అని. మార్కుల వెల్లడి అనంతరం రీ వాల్యుయేషన్ కోరుతూ వేలాది దరఖాస్తులు రాగా, వాటిని చూస్తున్న వారికి ఈ 'మూడు' ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీరి నిర్వాకం కారణంగా సుమారు 65 వేల మంది విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. ఒకవైపు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకోసం లక్షల రూపాయలు వెచ్చిస్తుంటే, ఇలా వచ్చీరాని చదువులతో ప్రశ్నాపత్రాలను లెక్కించి వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. కాగా, విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఆలోచనతో రీ వాల్యుయేషన్ పక్కాగా జరిపిస్తున్నట్టు గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు వివరించారు. ఈ తప్పులు సరిదిద్దేందుకు తమకెంతో సమయం పడుతోందని రీ వాల్యుయేషన్ చేస్తున్న ఉపాధ్యాయులు వాపోతున్నారు.