: మోదీకి క్షమాపణ చెప్పిన గూగుల్


గూగుల్ సెర్చ్ లో 'టాప్-10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోదీ చిత్రం రావడం పట్ల గూగుల్ క్షమాపణ చెప్పింది. "ఈ ఫలితాలు గూగుల్ అభిప్రాయం ప్రకారం రావు. కొన్నిసార్లు ఆశ్చర్యపూర్వక ఫలితాలు వస్తాయి. గందరగోళం లేదా పొరపాటు కారణంగానే ఇలా జరిగి వుండవచ్చు. ఇందుకు క్షమాపణ చెబుతున్నాము. అవాంఛిత ఫలితాలు రాకుండా ఉండేందుకు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంటాము" అని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఓ బ్రిటీష్ దినపత్రిక వెబ్ సైట్లో మోదీ చిత్రం ఉంచిన పేజీ కారణంగా ఈ పొరపాటు వాటిల్లినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. నేరచరిత్ర ఉన్న రాజకీయ నేతలపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మోదీ చిత్రాన్ని ఉంచగా, అది సెర్చ్ లో వచ్చినట్టు వివరించారు. విషయం తెలిసిన వెంటనే దాన్ని తొలగించామని అన్నారు.

  • Loading...

More Telugu News