: రేవంత్ అప్రూవర్ గా మారితే ఎలా?... దేశం నేతల మధ్య ఎడతెగని చర్చలు!


ఓటుకు నోటు ఆరోపణలపై సాక్ష్యాలతో దొరికిపోయి ప్రస్తుతం విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారితే ఏం చెయ్యాలన్న విషయమై దేశం నేతల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. తనను ముందు నిలిపి ఇరికించారని ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యుల వద్ద వాపోయారు. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి కనీసం బెయిలన్నా వెంటనే వచ్చేలా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారట. తనను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చినా, ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద ఉండడంతో ఇక ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో అప్రూవర్ గా మారి, తన వెనుక ఉన్న 'పెద్దలు', సదరు 'బాస్' వివరాలూ చెప్పేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలా చేయడం వల్ల తనను ప్రలోభపెట్టి ఈ పని చేసేందుకు పురిగొల్పారని ఆయన వాదించుకోవచ్చు. పైగా పెద్ద తలకాయలు ఇరుక్కుంటాయి కాబట్టి, తనపై కేసు తీవ్రతా తగ్గుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న తెలుగుదేశం నేతలు రేవంత్ కు అండగా నిలిచి ఆయన్ను ఎలాగైనా సముదాయించాలని చర్లపల్లి జైలుకు రాయబారాలు పంపుతున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News