: నాదల్ ను మట్టికరిపించిన జొకోవిచ్... బర్త్ డే నాడే నాదల్ కు చేదు అనుభవం


మట్టి కోర్టు (క్లే కోర్టు) మొనగాడు రఫెల్ నాదల్ ఈ దఫా ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయాడు. తొమ్మిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గి, పదో టైటిల్ పై కన్నేసిన నాదల్, నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓటమి చవిచూశాడు. రోలాంగ్ గారోస్ లో 70-1 ట్రాక్ రికార్డు ఉన్న నాదల్, కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ పై గురిపెట్టిన నోవాక్ జొకోవిచ్ చేతిలో చిత్తయ్యాడు. ఇదే కోర్టులో వీరిద్దరి మధ్య గతంలో జరిగిన ఆరు మ్యాచ్ ల్లో నాదల్ చేతిలో ఓటమి చవిచూసిన జొకోవిచ్, ఏడోసారి మాత్రం చరిత్ర తిరగరాశాడు. 7-5, 6-3, 6-1 స్కోరుతో నాదల్ పై పైచేయి సాధించి నేరుగా సెమీస్ చేరాడు. ఇదిలా ఉంటే, నిన్న తన బర్త్ డే నాడే నాదల్ రోలాండ్ గారోస్ లో పరాజయం పాలవడం విశేషం.

  • Loading...

More Telugu News