: కేసీఆర్ పై అలిగిన కొండా దంపతులు... ఆవిర్భావ వేడుకలకు దూరం


వరంగల్ జిల్లాలోనే కాక తెలంగాణ జిల్లాల్లో కీలక రాజకీయ నేతలుగా పేరుగాంచిన కొండా మురళి, సురేఖ దంపతులు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క ఆవిర్భావ వేడుకలకే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలకు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సురేఖ హాజరుకావడం లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరిన కొండా దంపతులు, ఉన్నట్లుండి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లోనూ కీలక నేతలుగానే వ్యవహరించారు. అయితే ఉన్నపళంగా వీరు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా కొండా సురేఖకు మంత్రి పదవితో పాటు పలు హామీలను కేసీఆర్ ఇచ్చారట. అయితే నెలలు గడిచిపోతున్నా, కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలా లేదు. అంతేకాక వరంగల్ జిల్లాకే చెందిన కొందరు నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. దీనిపై కొండా దంపతులు నేరుగా సీఎం కేసీఆర్ కే ఫిర్యాదు చేశారు. తొలుత బాగానే స్పందించిన కేసీఆర్, ఆ తర్వాత కొండా దంపతుల వైపు కన్నెత్తి చూడలేదట. దీంతో నొచ్చుకున్న కొండా దంపతులు పార్టీకే కాక ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వారి నుంచి సంచలన ప్రకటన వెలువడే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News