: ధోనీకి, నాకు పోలిక లేదు... మనస్తత్వాలు కూడా విభిన్నమే: కోహ్లీ


త్వరలోనే బంగ్లాదేశ్ లో పర్యటించనున్న టీమిండియా జట్టుకు యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ, ధోనీతో తనను ఎందుకు పోలుస్తారని ప్రశ్నించాడు. ధోనీకి, నా మనస్తత్వానికి ఎంతో తేడా ఉందని తేల్చి చెప్పాడు. నాది విభిన్నమైన మనస్తత్వమని తెలిపాడు. అయితే, ధోనీ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కోహ్లీ చెప్పాడు. టెస్టు క్రికెట్ లో ధోనీ ఎన్నో ఘన విజయాలు సాధించాడని... వాటికంటే మెరుగైన ఫలితాలను సాధించడం కష్టమైన పనే అని అన్నాడు. ధోనీ హయాంలో దిగ్గజ ఆటగాళ్లు కూడా ఉన్నారని... ప్రస్తుతం తాను యువ ఆటగాళ్లతో నిండిన జట్టును నడిపించాల్సి ఉందని చెప్పాడు. తనది దూకుడు స్వభావమని... అయితే, తన స్వభావాన్ని మాత్రం మార్చుకోను అని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News