: జైపూర్ లో మెట్రో సేవలు ప్రారంభం
మన దేశంలో ఇప్పటికే ఐదు నగరాల్లో మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తాజాగా ఈ రోజు రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాదులో కూడా త్వరలోనే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు లైన్లలో మెట్రో రైలు ట్రయల్ రన్ కొనసాగుతోంది.