: ఏపీ సీఎం చంద్రబాబుకు కల్వకుంట్ల కవిత సలహా
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎంపీ కల్వకుంట్ల కవిత సలహా ఇచ్చారు. చంద్రబాబు పాల వ్యాపారంతో పాటు పార్టీని మూసుకుని హైదరాబాద్ వచ్చి కొబ్బరికాయల దుకాణం పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు అమ్ముకుంటే గిరాకీ ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఏ-1 నిందితుడిగా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.