: చైనా 'డాగ్ మీట్ ఫెస్టివల్'పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన


చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉండే గుయాంగ్జి ప్రావిన్స్ లోని యులిన్ పట్టణంలో ప్రతి ఏడాది 'డాగ్ మీట్ ఫెస్టివల్'ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ లో కుక్క మాంసంతో రకరకాల వంటలు వండుకుని తింటారు. దాదాపు 10 వేల కుక్కలు ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రాణాలు కోల్పోతాయని అంచనా. దీంతో, ఈ ఫెస్టివల్ పై ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. జంతు ప్రేమికులంతా ఈ ఫెస్టివల్ ను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శునకాలను హింసించడం, చంపి తినడం దారుణమని చెబుతున్నారు. చైనా సోషల్ మీడియా సైట్ వెబోలో కూడా జంతు ప్రేమికులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని జంతు సంక్షేమ సమూహం change.org ఈ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తూ రెండు లక్షల మంది నుంచి సంతకాలు తీసుకుంది. మరోవైపు, చైనాలో కుక్కలను చంపి తినడం చట్ట విరుద్ధమైన పనేమీ కాదు. ఇంకా చెప్పాలంటే, సనాతనంగా వస్తున్న ఆచారాల్లో ఇదొకటని అక్కడ భావిస్తుంటారు.

  • Loading...

More Telugu News