: 'టాప్-10 క్రిమినల్స్'లో మోదీ ఫొటో... సిగ్గుచేటు అంటున్న డిగ్గీ రాజా
ఓసారి గూగుల్ లో టాప్-10 క్రిమినల్స్ అని టైప్ చేసి ఇమేజ్ సెర్చ్ చేయండి! సెర్చ్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, ఆ క్రిమినల్స్ ఫొటోల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కూడా కనిపిస్తుంది కాబట్టి. లాడెన్, అల్ జవహరి, దావూద్ ఇబ్రహీం వంటి క్రిమినల్స్ మధ్యలో మోదీ ఫొటో ఏంటని సోషల్ మీడియాలో దుమారం లేచింది. ఆ ఫొటో క్రిమినల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో ఎలా ప్రత్యక్షమైందన్నది ఆసక్తి కలిగిస్తోంది. సాంకేతిక తప్పిదమా? లేక, ఎవరైనా కావాలని చేసిన పనా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో స్పందించారు. "ప్రధానిని టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో చూసుకోవాల్సి రావడం దేశానికే అవమానం. ఓ భారతీయుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నా" అని పేర్కొన్నారు.