: ముందూవెనుకా, అటూఇటూ అంతా వాళ్లే... సిగ్గుగా లేదా?: సోమిరెడ్డి
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ లపై విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబును దెబ్బతీసేందుకు జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీఆర్ఎస్, వైసీపీలో దాదాపు అందరూ పార్టీ ఫిరాయింపుదారులేనని ఎద్దేవా చేశారు. జగన్ కూర్చుంటే ఆయన ముందు మైసూరారెడ్డి ఉంటారని, వెనుక రోజా కూర్చుంటారని, కుడివైపు కొడాలి నాని, ఎడమవైపు సూర్యనారాయణరెడ్డి ఉంటారని విమర్శించారు. కేసీఆర్ విషయానికొస్తే... ముందు తుమ్మల, వెనుక కడియం శ్రీహరి, కుడివైపు తలసాని, ఎడమవైపు మహేందర్ రెడ్డి ఉంటారని వివరించారు. ఫిరాయింపుదారులతో పార్టీలు కొనసాగించడానికి సిగ్గుగా లేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.