: చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడలో కాదు, ఢిల్లీలో ధర్నా చేయాలి: తమ్మినేని


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే నవ నిర్మాణ దీక్షను విజయవాడలో కాకుండా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద చేయాలని వైకాపా నేత తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. జగన్ చేపట్టిన సమరదీక్ష వేదికపై ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిపరుడని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తెలుగు వారిని అవినీతిపరులుగా చేసేందుకు చంద్రబాబే కారణమని అన్నారు. గతంలో గుజరాత్ లో మత ఘర్షణలు జరిగినప్పుడు... మోదీనీ ఉరి తీయాలని, దేశ బహిష్కరణ విధించాలని అన్న చంద్రబాబు ఇప్పుడు మోదీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News