: జైలులో రేవంత్ కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశం


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. టీడీపీ నేత అయిన రేవంత్ హోదా దృష్ట్యా ప్రత్యేక వసతులు కల్పించాలంటూ ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కోర్టు, వసతులు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి డబ్బు ఇవ్వజూపిన వ్యవహారంలో రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దాంతో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News