: క్రికెట్ తెరపైకి గాంధీ-మండేలా సిరీస్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కోసం ఇరు దేశాల బోర్డులు చర్చలు జరుపుతున్నాయి. ఈ సిరీస్ కు 'గాంధీ-మండేలా సిరీస్' అన్న పేరును ప్రతిపాదించారు. వచ్చే రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త డ్రెస్సులు, కిట్లను ఆవిష్కరిస్తూ, క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ ఈ విషయం తెలిపారు. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ నిర్వహించాలన్న మంచి ఆలోచనతో భారత్ ముందుకువచ్చిందని అన్నారు. ఈ సిరీస్ లో భాగంగా తాము భారత్ లో నాలుగు టెస్టులు ఆడతామని, అనంతరం, 2018లో భారత జట్టు సఫారీగడ్డపై నాలుగు టెస్టులు ఆడుతుందని లొర్గాత్ వివరించారు.