: నా భర్తపై కేసీఆర్ కక్ష కట్టారు... టీఆర్ఎస్ కు నా భర్త అంటే భయం: రేవంత్ భార్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి భార్య గీత మండిపడ్డారు. కేసీఆర్ తన భర్తపై కక్ష కట్టారని ఆరోపించారు. ఏదో ఒక విధంగా తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తారన్న విషయం తమకు తెలుసని... అయితే ఇంత త్వరగా అన్యాయంగా ఇరికిస్తారని ఊహించలేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ తన భర్త అంటే భయమని... అందుకే, ఆయనను టార్గెట్ చేశారని విమర్శించారు. తెలంగాణలోని భూములను ఓ వ్యక్తికి ధారాదత్తం చేస్తుండటాన్ని తన భర్త అడ్డుకుంటున్నందుకే ఆయనను టార్గెట్ చేశారని మండిపడ్డారు.