: బొత్స పచ్చి అవకాశవాది: వీహెచ్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పార్టీ నేత బొత్స సత్యనారాయణపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పందించారు. బొత్స పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు. పార్టీలో పదవులన్నీ అనుభవించి పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ వేరే పార్టీలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని మీడియా సాక్షిగా వీహెచ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మద్దతిచ్చిన తమ అధినేత్రి సోనియాగాంధీపై బాబు నిందలేయడమా? అని అడిగారు. అవినీతి సహించనన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ... చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు.

  • Loading...

More Telugu News