: చంద్రబాబు వద్దకు రేవంత్ సోదరుడు?


జైల్లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై పలు రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డిలు మంచి స్నేహితులు. ఈ సందర్భంగా, చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి ఎలా వ్యవహరించాలనే అంశంపై వీరు చర్చించి ఉంటారని ఓ వర్గం చెబుతోంది. మరోవైపు, రేవంత్ ను రాజీనామా చేయాలని కోరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని చంద్రబాబు వద్దకు తీసుకువెళుతున్నట్టు కొందరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News