: ఫ్రెంచ్ ఓపెన్ లో గాయపడిన ప్రేక్షకులు
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పారిస్ లో బుధవారం ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల కారణంగా మ్యాచ్ లు జరుగుతున్న ఫిలిప్ చాట్రియర్ స్టేడియంలో స్కోరు బోర్డుకు ఉన్న ఉక్కు అమరిక ఊడి ప్రేక్షకులపై పడింది. దాంతో, ముగ్గురు వీక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స నిర్వహించి, ఆసుపత్రికి తరలించినట్టు టోర్నీ నిర్వాహకులు తెలిపారు. సోంగా (ఫ్రాన్స్), నిషికొరి (జపాన్) మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.