: ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు: రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెల 6న రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ రణగర్జన నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల హామీల అమలును సీఎం చంద్రబాబు మరచిపోయారని, అందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. విశాఖలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పలువురు ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, వైసీపీలోకి వెళుతున్న పార్టీ నేత బొత్స సత్యనారాయణ అంశంపై చర్చించారు.